నంద్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల మున్సిపల్ (Nandyal Municipal) వైస్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ సమాన బలం నేపథ్యంలో కీలక పరిణామం జరిగింది. వైసీపీ కౌన్సిలర్ సరోజమ్మ (Sarojamma) గైర్హాజరయ్యారు. దీంతో వైస్ చైర్మన్ (Vice Chairman) పదవి తెలుగుదేశం పార్టీకే దక్కింది. వైస్ చైర్మన్గా 11వ వార్డు సభ్యుడు ఉప్పరి సుబ్రహ్మణ్యం (Uppari Subrahmanyam) ఎన్నికయ్యారు. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు.







