ఇంట్లో వాళ్లకే న్యాయం చేయలేనోడు ప్రజలకేం చేస్తాడు? : పల్లా శ్రీనివాసరావు
సొంత తల్లికి, చెల్లికే న్యాయం చేయలేని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ వివాదాలను పరిష్కరించుకోలేక, తెదేపా (TDP)పై నెట్టడం, బురద జల్లడం తగదని మండిపడ్డారు. రాజకీయ వేదికలపై మహిళా గౌరవం గురించి గొప్పలు చెప్పే జగన్ (Jagan), ఆచరణలో మాత్రం సొంత తల్లిని, చెల్లిని రోడ్డున పడేశారని విమర్శించారు. వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు. ఆస్తి వివాదాల కోసం సొంత కుటుంబ సభ్యులనే బయటకు నెట్టేయడం జగన్ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. తల్లి, చెల్లి రోడ్డు పై బాధపడుతుంటే సీపీ కెమెరాల్లో చూస్తూ ఆనందిస్తున్నారని దుయ్యబట్టారు.







