కర్రెగుట్టల్లోకి పర్యాటకులకు నో ఎంట్రీ : డీజీపీ ఆనంద్
కర్రెగుట్టల్లోకి పర్యాటకులను అనుమతిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డీజీపీ సీవీ ఆనంద్ ( DGP CV Anand) తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీ అందజేసే కార్యక్రమంలో డీజీపీ మాట్లాడారు. కర్రెగుట్టల (Karreguttalu) ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అక్కడ మావోయిస్టులు (Maoists) పెద్ద సంఖ్యలో మైన్స్ (mines) ఏర్పాటు చేశారు. ప్రెషర్ మైన్స్ ఏర్పాటు చేసినట్లు అనుమానం ఉందని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో స్పష్టమైన సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. కొంతమంది మావోయిస్టులను విచారించిన అనంతరం కర్రెగుట్టల వద్ద 9 ఆయుధ డంపులను గుర్తించినట్లు వెల్లడించారు. మందుపాతరలను పూర్తిగా తొలగించి, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టి ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసిన తర్వాతే పర్యాటకుల (Tourists)కు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.







