ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి అధికారంలోకి వస్తాం : విప్ ఆది శ్రీనివాస్
తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ (BRS) అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పగటికలలు కంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గాంధీభవన్‌లో ఆది శ్రీనివా (Adi Srinivas)స్ మాట్లాడుతూ పదేళ్ల పాటు విధ్వంసకర పాలన సాగించిన కేసీఆర్ (KCR) మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. రానున్న 500 రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతారని కేటీఆర్ అంటున్నారని, కానీ 5 వేల రోజులైనా ఆయన సీఎం (CM) కాలేరు. 2023 డిసెంబరు నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ప్రజాక్షేత్రంలో భారాస ప్రదర్శన సున్నా అని పేర్కొన్నారు.కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రజల ఆదరణ పొందుతోందని తెలిపారు. పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.







