రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్
హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ (Kode Durga Prasad) కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హాజరయ్యారు. హైదరాబాద్ లోని అన్వయ కన్వెన్షన్ లో జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులు అనీష్ వెంకటాద్రి (Aneesh Venkatadri), డాక్టర్ సుమాంజలి (Dr. Sumanjali)ని ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.







