మ్యాప్స్‌లో చిక్కిన వారణాసి సెట్!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రిస్టీజియస్ ఫిల్మ్ వారణాసి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ కాశీ సెట్‌ను నెటిజన్లు యాపిల్ మ్యాప్స్ ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. మ్యాప్స్‌లోని ఏరియల్ వ్యూను జూమ్ చేస్తూ ఓ నెటిజన్ రూపొందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో పురాతన కాశీ నగరాన్ని తలపించే ఆలయాలు, ఘాట్లు, భారీ నిర్మాణాలు కనిపిస్తున్నాయి.
భారత్‌లో యాపిల్ మ్యాప్స్‌కు ఇటీవల వచ్చిన అప్డేట్తో ఈ సెట్ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కాశీ నగరంలోని చారిత్రక, ఆధ్యాత్మిక వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ హైదరాబాద్‌లోనే భారీ సెట్లను నిర్మించింది. తాజాగా వైరలవుతున్న దృశ్యాలు రాజమౌళి నిర్మిస్తున్న సినీ ప్రపంచంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా నిర్మాణ స్థాయి గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
భారతీయ పురాణాల నేపథ్యంలో టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో నిమగ్నమైంది. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ను అలరించే లక్ష్యంతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.







