వారణాసి రిలీజ్పై ఉత్కంఠ.. రాజమౌళి ప్లాన్ మారలేదా?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా వారణాసి రిలీజ్పై సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ, సినిమా 2027 సెకండాఫ్ కు వాయిదా పడే అవకాశముందంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే, మేకర్స్ మాత్రం ముందుగా డిసైడ్ చేసిన రిలీజ్ డేట్ ను టార్గెట్ గా చేసుకునే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మెయిన్ షూటింగ్ పూర్తికాగా, కొన్ని ఎక్స్ట్రా సీన్స్ తో పాటు మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్స్ ను త్వరలోనే షూట్ చేయనున్నారట. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో రిలజ్ డేట్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, డైరెక్టర్ వాటిపై రియాక్ట్ అవకుండా సినిమా పనులపైనే దృష్టి సారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే, ఈ భారీ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ డిస్కషన్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కొత్త అప్డేట్స్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మూవీ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ లో ఎలాంటి అఫీషియల్ ఛేంజ్ లేకపోవడంతో ఫ్యాన్స్ రాజమౌళి నెక్ట్స్ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







