హైదరాబాద్లో తానా పురస్కారాల వేడుకలు… 100 మంది చిన్నారుల పాటల ప్రదర్శన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డిసెంబర్ 29వ తేదీన నిర్వహిస్తున్న పురస్కారాల వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి చెప్పారు. డాక్టర్ కోమండూరి రామాచారి గారి లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ వేదికపై అద్భుతమైన సంగీత ప్రదర్శన నిర్వహిస్తున్నారని తెలిపారు. భావితరాల గాయనీ గాయకుల మధురగానాన్ని అందరూ వచ్చి వీక్షించాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి
ఈ వేడుకల్లో భాగంగా వివిధరంగాల్లో విశేష కృషి చేసినవారిని తానా పురస్కారంతో సన్మానించనున్నారు. అమరరాజా గ్రూప్ ఫౌండర్ డా. రామచంద్ర నాయుడు గల్లా, ప్రఖ్యాత పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ (తానా అందె శ్రీ పురస్కారం), శ్రీమతి జమీలా నిషాత్, డా. సునితా కృష్ణన్, జయధీర్ తిరుమల రావు, గడ్డం సమ్మయ్య, చింతకింది మల్లేశం, చింతల వెంకట్ రెడ్డి , దాసరి కొండప్ప తదితరులను ఈ వేడుకల్లో సన్మానించనున్నారు.







