ఔత్సాహికుల వేదిక ఐడ్రీమ్ ఫిల్మ్ కాన్క్లేవ్ 2026 : ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి
అమెరికాలోని తెలుగు యువతలో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించటానికి ఏర్పాటు చేసిన ఐ డ్రీమ్ వారి ఫిల్మ్ కాన్క్లేవ్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. కాలిఫోర్నియా, మిల్పిటాస్ లోని ఫాల్కన్ ఎక్స్ మీటప్స్ వేదికగా జరిగిన కాన్ క్లేవ్ కు ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కోమటి జయరామ్ ముఖ్యఅతిథిగా విచ్చేసారు.
ఇవి కూడా చదవండి
బే ఏరియా హాజరైన ఔత్సాహికులకు కోమటి జయరామ్ వక్తలను పరిచయం చేసి, ఔత్సాహిక తెలుగు స్క్రీన్ప్లే మరియు సంభాషణల రచయితలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినీ రంగంలో కొత్తగా వచ్చేవారు అనుభవజ్ఞులైన నిపుణులతో పరిచయాలు పెంచుకోవడానికి, మార్గనిర్దేశం పొందడానికి మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలను అన్వేషించడానికి ‘ఐడ్రీమ్ ఫిల్మ్ కాన్క్లేవ’ ఒక విలువైన వేదిక అని ఆయన పేర్కొన్నారు. విక్రమ్ సిరికొండ సినీ రచయితలు మరియు దర్శకులు గోపీ మోహన్ వక్తలుగా వ్యవహరించగా విరిజల్లు రేడియో నుండి విజయ ఆసూరి, కళ్యాణ్ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.







