శ్రీశైలంలో ఘనంగా జ్వాలా తోరణోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు (Kartika Purnima Celebrations ) ఘనంగా జరిగాయి. తొలుత శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను గంగాధర మండపం వద్దకు తీసుకొచ్చి, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జ్వాలా తోరణాలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి (udda Rajashekhara Reddy) దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు (Pothugunta Ramesh Naidu), ఈవో ఎం.శ్రీనివాసరావు (M. Srinivasa Rao) వెలిగించారు. వేల మంది భక్తులు జ్వాలా తోరణోత్సవాన్ని తిలకించి దివ్యానుభూతి చెందారు.







