సింగరేణి కార్మికులకు శుభవార్త
సింగరేణి (Singareni)లో పనిచేస్తోన్న ఒప్పంద కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు కార్మికుల (Contract Workers) పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో (Singareni Educational Institutions) పదో తరగతి వరకు ఉచిత విద్య (Free Education)అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో యాజమాన్యం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సంస్థలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.







