మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు : మంత్రి అచ్చెన్న
కాకినాడ జిల్లా సుబ్బంపేట నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల (Fishermen) ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు. సమాచారం లేని మత్స్యకారుల రక్షణపై కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. కోస్ట్‌గార్డ్ (Coast Guard), నౌకాదళం (Indian Navy), ఒడిశా అధికారుల సాయంతో యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఏడుగురినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా (Kakinada District) ఏటిమొగ నుంచి చేపలవేటకు వెళ్లిన జాలర్లు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఇంజిన్ వైఫల్యంతో సముద్రంలో నిలిచిన బోటులోని మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్నారు. కోస్ట్‌గార్డ్, నౌకాదళాన్ని అప్రమత్తం చేసిన అధికారు పనితీరు అభినందనీయమని తెలిపారు.







