ఆటా లో ఎన్నికలు… సవ్యంగా జరిగేలా చర్యలు..
అమెరికాలో నవంబర్‌లో ఎన్నికల హడావిడి ముగియగానే డిసెంబర్లో జరిగే తెలుగు జాతీయ సంస్థల్లో ఒకటైన ఆటా ఎన్నికల హడావిడి మొదలైంది. ఆటా అధ్యక్షులు శ్రీ జయంత చల్లా మాట్లాడుతూ దాదాపు 30000 మంది లైఫ్ మెంబర్లు పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, డిసెంబరు ఒకటి నుంచి జనవరి రెండు వరకు ఈ ఎన్నికల కోలాహలం ఉంటుందని, పూర్తిస్థాయి ప్రజాస్వామ్య పద్ధతిలో, ఆటా బైలాస్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆటా ఎలెక్షన్ కమిటీ చైర్పర్సన్ శ్రీ శ్రీకాంత్ గుడపాటి మాట్లాడుతూ, ఆసక్తికరమైన విషయాలు మరెన్నో తెలిపారు. పూర్తి వివరాలు తెలుగు టైమ్స్ 1 డిసెంబర్ 2026 సంచికలో వస్తున్నా ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఆన్లైన్ లో తెలుసుకుందాం.
తెలుగు జాతీయ సంస్థల్లో ఆటా 37 సంవత్సరాల చరిత్ర తో పేరొందిన సంస్థ. ఆటా బై లాస్ కూడా అత్యంత జాగ్రత్తగా రూపొందించబడ్డాయి. ఆటా బోర్డులో 31 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లైఫ్ మెంబర్ ల చేత నేరుగా నాలుగు సంవత్సరాలకు ఎన్నుకోబడతారు. అయితే 15 మంది ఒకసారి, రెండు సంవత్సరాల తర్వాత ఇంకొక 16 మంది ఎన్నికవుతారు. ఆటా కార్యక్రమాల నిర్వహణలో continuety ఉంటుందని ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు.
ఆ ప్రకారం, ఈ డిసెంబర్ లో 16 మంది డైరెక్టర్స్ ఎన్నుకోబడతారు. మొదటిసారిగా ఒక థర్డ్ పార్టీ కి ఈ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాన్ని అప్పజెప్తారు. పోర్ట్‌ల్యాండ్‌లో ఉన్న ఎలక్షన్ ట్రస్ట్ (Election Trust ) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఈ 16 మంది డైరెక్టర్లో కూడా గ్రాండ్ పాట్రన్ కేటగిరీ నుంచి ముగ్గురు, పాట్రన్ కేటగిరీ నుంచి ముగ్గురు, లైఫ్ మెంబర్ కేటగిరీ నుంచి పది మంది ఉంటారు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం గ్రాండ్ ప్యాటర్న్ నుంచి మూడు పోస్టులకు ఐదుగురు, ప్యాటర్న్ నుంచి మూడు పోస్టులకు ఆరుగురు, లైఫ్ మెంబర్ కేటగిరీ నుంచి పది పోస్టులకు పద్దెనిమిది మంది ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు.
కేటగిరీ ప్రకారం వివిధ రంగుల్లో ఈ బ్యాలెట్ పేపర్లను ఇప్పటికే ప్రింట్ చేశారు. డిసెంబర్ ఒకటో తేదీన బ్యాలెట్ పేపర్లను సభ్యులందరికీ పంపిస్తారు. సభ్యులు వారు కోరుకున్న వ్యక్తికి ఓటు వేసి బ్యాలెట్ పేపర్లను వెనక్కి పంపించాలి. 2 జనవరి 2027 ఉదయం 12 గంటల వరకు వచ్చిన బ్యాలెట్ పేపర్లను మాత్రమే స్వీకరిస్తారు. వాటిని కేటగిరీ వారీగా, సభ్యుల వారీగా లెక్కపెట్టి, దాదాపు అదే రోజున ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. బైలాస్ ప్రకారం బాలట్ పేపర్లు లెక్కించడం ఆటా హెడ్ క్వార్టర్స్ అయిన చికాగోలో జరుగుతుంది.
ప్రతి బ్యాలెట్ పేపర్‌కి QR code పెట్టడం జరిగింది. తర్వాత కవర్ కి కూడా color coding చేయడం జరిగింది. దాని వల్ల ఎలాంటి మోసం, దుర్వినియోగం జరగదు.
ఎన్నికైన సభ్యులు 23 జనవరి 2027 వ తేదీన లాస్ వెగాస్‌లో జరిగే జనరల్ బాడీ మీటింగ్‌లో ప్రమాణ స్వీకారం చేసి, అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
శ్రీ శ్రీకాంత్ గొడపాటి ఎలెక్షన్ కమిటీ చైర్ పర్సన్ గా శ్రీ వెంకట్రామ్ రెడ్డి రావి, శ్రీ సాయి సుధిని, రవి చల్లా ఈ కమిటీ సభ్యులు గా ఉన్నారు.
ఆటా Constitution ప్రకారం Slate candidates , Non Slate Candidates అనే విభజన కూడా ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారం ముందుగా కొందరిని నామినెటే చేస్తారు. ఆ ప్రకారం, Grand pattern నుంచి ముగ్గురిని, Pattern నుంచి ముగ్గురిని, Life members నుంచి పది మందిని నామినెట్ చేసిరారు. వారిని SLATE మెంబర్లు గా ఎన్నికల బరి లో ఉంటారు. వారు కాకుండా ఇంకా మరికొందరు నామినేషన్ వేసినపుడు వారిని NON SLATE మెంబెర్స్ గా పరిగణిస్తారు. వారందరూ ఎన్నికల బరి లు ఉంటారు. ఈ సారి 16 పోస్ట్ లకు 39 మంది సభ్యుల నుంచి నామినేషన్లు వచ్చాయి. అందులో నాలుగు తిరస్కరించబడ్డాయి. ఏడుగురు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు 29 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి ఎన్నికైన వారికి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇంత పద్ధతిగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పూర్తి క్రమశిక్షణతో నిర్వహిస్తారని ఆశిస్తూ, ఆటకి, ఆట నాయకత్వానికి అభినందనలు! రాబోయే ఆట నాయకులందరికీ ముందుగా శుభాకాంక్షలు.
చెన్నూరి వేంకట సుబ్బారావు
ఎడిటర్ -తెలుగు టైమ్స్







