రెండో విడతలో 1,171 పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవం
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల (Panchayat Elections)కు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల తుది లెక్క తేలింది. తొలి దశతో పోలిస్తే మలి విడతలో ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది.23.53 శాతం సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లోని 52 రెవెన్యూ డివిజన్లలో మొత్తం 4,975 గ్రామ పంచాయతీలకు రెండో దశ (Second Phase)లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 1,171 సర్పంచి (Sarpanch) పదవులు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) ప్రకటించింది. మిగిలిన 3,803 సర్పంచి స్థానాలకు 10,292 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.ఈ పంచాయతీలో 49,318 వార్డు సభ్యుల స్థానాలకు గాను 19,651 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,608 వార్డు స్థానాలకు 63,410 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది.







