టీడీపీ నేత కర్రోతు బంగార్రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్
భోగాపురం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు కుమారుడి వివాహ వేడుక భోగాపురం మండలం పోలిపల్లిలోని భూమాత గ్రీన్ వే రిసార్ట్ లో ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. నూతన వధూవరులు శేఖర్, నేహాలను ఆశీర్వదించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.







