వారణాసి రిలీజ్ వాయిదా.. రాజమౌళి కీలక నిర్ణయం?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రిస్టీజియస్ ప్రాజెక్టు వారణాసి రిలీజ్‌పై కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. అయితే, ప్రేక్షకులకు బెస్ట్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ను అందించాలనే ఉద్దేశంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్టు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎక్కడా రాజీ పడటం లేదట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి. వీఎఫ్ఎక్స్కు సంబంధించిన ఫైనల్ అవుట్‌పుట్‌ను పరిశీలించిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్‌పై డెసిషన్ తీసుకోనున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేయడం కంటే, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో ఆడియన్స్ ముందుకు తీసుకురావడమే రాజమౌళి టార్గెట్‌గా పెట్టుకున్నారట.
మరోవైపు, షూటింగ్ విషయంలో మాత్రం అనుకున్న ప్లాన్ ప్రకారమే చిత్రబృందం ముందుకు సాగుతోంది. మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ తో పాటు మిగిలిన కొన్ని సీన్స్ ను త్వరలో షూట్ చేయనున్నారు. పురాణ నేపథ్యంతో కూడిన భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ పై మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.







