నిర్మాతగా నందమూరి తేజస్విని.. సైలెంట్‌గా సినిమా ప్రారంభం!
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కొత్త సినీ ప్రయాణం ప్రారంభం కానుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) చిన్న కూతురు తేజస్విని(tejaswini) సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా బాలయ్య(Balayya)కు సంబంధించిన సినీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆమె, ఇటీవల ఓ ఆభరణాల సంస్థ యాడ్ లోనూ కనిపించారు. దీంతో నటిగా వెండితెరకు పరిచయం కానున్నారనే ప్రచారం జరిగింది. అయితే అందరి అంచనాలకు భిన్నంగా నిర్మాతగా తన లక్ ను టెస్ట్ చేసుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
యంగ్ హీరో నిఖిల్(Nikhil) నటిస్తున్న స్వయంభూ(Swayambhu) మూవీ నిర్మాత భువన్(Bhuvan) ఈ సినిమాతో డైరెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నట్లు సమాచారం. తేజస్విని, భువన్ చిన్ననాటి సహాధ్యాయులు కావడంతో పాటు మంచి ఫ్రెండ్స్ కూడా. భువన్ సోదరుడు నాగ అన్వేష్(Naga anvesh) ఇందులో హీరోగా నటించనున్నారు. కథకు ప్రాధాన్యమున్న సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ బుధవారం వైజాగ్ లో ఎలాంటి హడావుడి లేకుండా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
గతంలో వినవయ్య రామయ్య(Vinavayya ramayya), ఏంజెల్(Angel) సినిమాలతో ఆడియన్స్ ను పలకరించిన నాగ అన్వేష్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వెండితెరపైకి రానున్నారు. నెక్ట్స్ ఇయర్ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్స్ చేస్తున్నారట. సినిమా టైటిల్, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే అఫీషియల్ గా వెల్లడించే అవకాశముంది. తొలి నిర్మాణ ప్రయత్నంలో తేజస్విని ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నందమూరి ఫ్యాన్స్ లోనూ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది.







