వారణాసి డేట్ పై కన్నేసిన సేయోన్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli), మహేష్ బాబు(Mahesh babu) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా వారణాసి(Varanasi) రిలీజ్ వాయిదా పడే అవకాశముందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడితే, ఆ డేట్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఇతర సినిమాల నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్(Siva karthikeyan) నటిస్తున్న సేయోన్(Seyon) సినిమాను అదే తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మురుగన్ స్వామి(murugan swami) స్ఫూర్తితో రూపొందుతున్న సేయోన్(Seyon) సినిమాకు శివకుమార్ మురుగేషన్(Sivakumar Murugeshan) దర్శకత్వం వహిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్(radhika sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన తాయ్ కిళవి(Thai Kilavi) సినిమాతో ఆయన డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri borse) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Rajkamal films international) పతాకంపై కమల్ హాసన్(kamal haasan), ఆర్. మహేంద్రన్(R. mahendran) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్(Santhosh narayanan) మ్యూజిక్ అందిస్తున్నారు. సమ్మర్ హాలీడేస్ ను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. అయితే వారణాసి వాయిదాపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. సేయోన్ రిలీజ్ డేట్ పైనా క్లారిటీ రావాల్సి ఉంది. రాజమౌళి తీసుకునే డెసిషన్ ఇతర సినిమాల రిలీజ్ ప్లానింగ్స్ పైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.







