ఆకాశంలో ఒక తార.. బాక్సాఫీస్ వద్ద పెరుగుతున్న జోరు!
భారీ ఓపెనింగ్స్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది ఆకాశంలో ఒక తార(Aakasam lo oka taara). దుల్కర్ సల్మాన్(Dulquer salman), సాత్విక వీరవల్లి(Satvika veeravalli) జంటగా పవన్ సాధినేని(Pavan sadhineni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. అయితే, సినిమా చూసిన ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో క్రమంగా థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎమోషన్స్ తో కూడిన స్క్రీన్‌ప్లే ఆడియన్స్ ను ఆకట్టుకుంటుండటం సినిమాకు కలిసొస్తోంది.
మామూలుగా వీకెండ్ అయిపోయిన తర్వాత సినిమాల కలెక్షన్లలో తగ్గుదల కనిపిస్తుంది. కానీ, ఆకాశంలో ఒక తార విషయంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. మంగళవారం ఏకంగా 73.87 వేల టికెట్లు అమ్ముడవడం విశేషం. ఓవర్సీస్లోనూ ఈ సినిమా ఆకట్టుకుంటోంది. నార్త్ అమెరికాలో మంగళవారం కలెక్షన్లు లక్ష డాలర్లకు చేరువ కావడం సినిమా బాక్సాఫీస్ ప్రస్థానానికి మరింత బలాన్నిస్తోంది. వర్కింగ్ డేస్‌లోనూ ఈ రేంజ్ లో ఆదరణ లభించడం చిత్ర వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే మంచి ఆదాయం సమకూరడంతో సెకండ్ వీకెండ్‌కి ముందే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కంటిన్యూ అయితే సినిమా మరింత మెరుగైన కలెక్షన్లను నమోదు చేసే అవకాశముంది. భారీ ఓపెనింగ్స్ కంటే ఆడియన్స్ ను మెప్పించే కథే సినిమా సక్సెస్‌కు కీలకమని ఆకాశంలో ఒక తార మరోసారి ప్రూవ్ చేస్తోంది.







