అనిల్ రావిపూడి ముందున్న అసలు సవాల్!
సంక్రాంతి సీజన్లో వరుస సక్సెస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) మరోసారి పండగ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేష్(Venkatesh), కల్యాణ్ రామ్(Kalyan ram), కీర్తి సురేష్(Keerthy suresh), కృతి శెట్టి(Krithi shetty) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న జనవరి 12 విడుదల సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సాంగ్ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam), మన శంకర వరప్రసాద్ గారు(Mana shankara varaprasad garu) సినిమాలకు పాటలే మెయిన్ ప్రమోషనల్ టూల్స్ గా నిలిచాయి. ఈసారి మాత్రం ఆ మ్యాజిక్ కనిపించలేదు.
ఇవి కూడా చదవండి
సినిమా ప్రచారంలో తనదైన వ్యూహాలతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం అనిల్ రావిపూడి స్పెషాలిటీ. దీంతో రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌పై ఆసక్తి నెలకొంది. డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. తర్వాత సాంగ్స్, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచాల్సిన బాధ్యత అనిల్‌పై ఉంది.
మరోవైపు 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశముంది. చిరంజీవి(Chiranjeevi) కాకా(kaaka), సాయిధరమ్ తేజ్(Sai dharam tej) సంబరాల ఏటిగట్టు(sambarala yetigattu), శ్రీవిష్ణు(Sree vishnu) ఫ్యామిలీ ప్యాక్(Family Pack), ప్రశాంత్ వర్మ(prasanth varma) మహాకాళి(mahakaali) వంటి సినిమాలు పండగ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆడియన్స్ దృష్టిని తన సినిమావైపు మళ్లించడం అనిల్‌కు కీలకంగా మారింది. మరి తనదైన ప్రచార వ్యూహాలతో సినిమాకు కావాల్సిన క్రేజ్ తీసుకొచ్చి, సంక్రాంతి సక్సెస్ స్ట్రీక్ ను అనిల్ కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.







