తరుణ్ భాస్కర్ ముందున్న అసలు సవాల్!
ఈ నగరానికి ఏమైంది రిపీట్(ENE Repeat) సక్సెస్ తో డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tharun bhascker) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, సినిమా సక్సెస్ మీట్ లో ఆయన చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన సామర్థ్యాన్ని కొందరు తక్కువగా అంచనా వేశారని పేర్కొన్న ఆయన, రాబోయే సినిమాలతో ఏ, బీ, సీ సెంటర్ల ఆడియన్స్ ను మెప్పిస్తానని ధీమా వ్యక్తం చేశారు. లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకత్వంలో సక్సెస్ను అందుకున్న తరుణ్ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
డైరెక్టర్ గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్, కొంతకాలంగా యాక్టింగ్ పై ఎక్కువ దృష్టి సారించారు. అయితే, నటుడిగా ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్లు దక్కలేదు. మరోవైపు, ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు పట్టణ ప్రాంతాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ నగరానికి ఏమైంది రిపీట్ కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు ఓవర్సీస్లో సత్తా చాటింది.
ఇవి కూడా చదవండి
వాస్తవానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన డైరెక్షన్ పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో విమర్శలకు కామెంట్స్ తో ఆన్సర్ ఇవ్వడం కంటే, తనదైన కథన శైలితో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఆయన ముందున్న ప్రధాన సవాల్ గా మారింది. మరి తన నెక్ట్స్ మూవీతో ఆడియన్స్ అభిరుచుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, కమర్షియల్ డైరెక్టర్ గానూ సత్తా చాటుతారేమో చూడాలి.







