విజయశాంతి బాటలో సాయిపల్లవి?
నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాయిపల్లవి ఇప్పుడు తన కెరీర్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పటివరకు ఎమోషనల్ క్యారెక్టర్లతో మెప్పించిన ఈ నటి, ఓం సినిమాలో పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్ లోనూ తనదైన టాలెంట్ ను చాటుతూ కమర్షియల్ హీరోయిన్ గా సరికొత్త ఇమేజ్ను సొంతం చేసుకుంటోంది. ఆమె యాక్షన్ అవతారం ఆడియన్స్ తో పాటు సినీ వర్గాల్లోనూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు దారితీసింది.
ఓవైపు రామాయణ వంటి భారీ పౌరాణిక సినిమా, మరోవైపు ఓం వంటి యాక్షన్ సినిమాతో తన యాక్టింగ్ పరిధిని విస్తరించుకుంటోంది సాయిపల్లవి. భిన్నమైన కథలను ఎంచుకుంటూ అన్ని వర్గాల ఆడియన్స్ కు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు ఆమె సరైన ఛాయిస్ గా నిలిచే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
గతంలో విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ చాప్టర్ ను సృష్టించారు. హీరోయిన్లు కూడా కమర్షియల్ సినిమాలను తమ భుజాలపై నడిపించగలరని నిరూపించారు. ఇప్పుడు సాయిపల్లవిలోనూ అలాంటి సామర్థ్యం కనిపిస్తోందనే డిస్కషన్ సాగుతోంది. బలమైన కథలు, పవర్ఫుల్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళితే యాక్షన్ సినిమాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రాబోయే రోజుల్లో సాయిపల్లవి ఈ తరహా సినిమాలకు ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి.







