త్రివిక్రమ్‌పై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas)తో పాటు ఆదర్శ కుటుంబం(Aadarsa kutumbam) మేకర్స్ పై తెలుగు నటి పూజిత పొన్నాడ(poojitha ponnada) సంచలన ఆరోపణలు చేశారు. సినిమాలో కీలక పాత్ర ఇస్తామని డీల్ కుదుర్చుకుని, చివరకు ఒక్క సీన్‌కే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2025 డిసెంబరులో తాను యూకేలో ఉన్న టైమ్ లో మూవీ కో డైరెక్టర్ సంప్రదించారని తెలిపారు. జనవరి 3న హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత లుక్ టెస్ట్ నిర్వహించి, త్రివిక్రమ్ స్వయంగా తనను ఎంపిక చేశారని వెల్లడించారు.
కథ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు తన క్యారెక్టర్ ఉంటుందని, నారా రోహిత్(nara rohit)తో కీలక సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని చెప్పినట్లు పూజిత పేర్కొన్నారు. డీల్ పై సైన్ చేసి, అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ షెడ్యూల్లో ఐదు రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నానన్నారు. అయితే దాదాపు మూడు నెలలపాటు తర్వాతి షెడ్యూల్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఆ తర్వాత తన ప్లేస్ లో ఓ సీనియర్ నటిని తీసుకున్నట్లు తెలిసిందన్నారు.
ఇవి కూడా చదవండి
మేకర్స్ డెసిషన్ ను అంగీకరించినప్పటికీ, థియేటర్లో సినిమా చూసినప్పుడు తనకు తీవ్ర నిరాశ ఎదురైందని పూజిత తెలిపారు. తాను నటించిన సీన్స్ లో ఒక్కటి మాత్రమే ఉంచారని, కనీసం టైటిల్స్‌లోనూ తన పేరు వేయలేదని ఆరోపించారు. ముందస్తు సమాచారం లేకుండా తన క్యారెక్టర్ ను మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనకు ఎదురైన ఈ ఎక్స్‌పీరియెన్స్ కు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై చిత్రబృందం రెస్పాన్స్ తెలియాల్సి ఉంది.







