బెంగళూరులో వైఎస్ షర్మిల కుమార్తె వివాహం
బెంగళూరు సమీపంలోని నందిహిల్స్ రిసార్టులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కుమార్తె అంజలీరెడ్డి(Anjali Reddy), రఘురామిరెడ్డి (Raghurami Reddy) ల వివాహం జరిగింది.బుధవారం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరగగా, గురువారం నందిహిల్స్ పరిసరాల్లోని రిసార్టులో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక నిర్వహించనున్నారు. ఇరువైపుల నుంచి కేవలం 100 మంది చొప్పున మాత్రమే పరిమిత సంఖ్యలో అతిథులు విచ్చేశారు. షర్మిల సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 9YS Jagan Mohan Reddy)కి ఈ పెళ్లికి ఆహ్వానం అందలేదు, అలాగే ఆయనతో సన్నిహితంగా ఉండే బంధువులెవరూ హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు రాష్ట్ర రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.







