మళ్లీ సందడి చేయనున్న నంది అవార్డులు.. డిసెంబర్లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఏపీలో నంది అవార్డుల సందడి మొదలుకానుంది. 2026 డిసెంబర్లో విజయవాడ/అమరావతిలో 2017–24, 2025 సంవత్సరాల నంది చలనచిత్ర అవార్డులు, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ అవార్డుల వేడుక ముందస్తు ఏర్పాట్ల కోసం ఇంటర్-డిపార్ట్మెంటల్ కమిటీని (అంతర్-శాఖల కమిటీ) నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (I&PR) జీవోలు జారీ చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్ – ఎఫ్ఏసీ) ఎస్. సురేశ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వేడుకలకు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నోడల్ ఏజెన్సీగా, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మెంబర్-కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్, ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థ (AP Tourism Authority) సీఈఓ, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ వేదిక ఖరారు, కార్యక్రమ షెడ్యూల్ రూపకల్పన, సినీ ప్రముఖులు, అవార్డు గ్రహీతలతో సమన్వయ బాధ్యతలను ఈ కమిటీ పర్యవేక్షించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వేదిక, సాంకేతిక ఏర్పాట్లు, ఆతిథ్యం, వసతి, రవాణా, ప్రోటోకాల్, భద్రత, ప్రచారం, మీడియా సమన్వయ పనులను ఈ కమిటీ సమగ్రంగా అమలు చేయనుంది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అనుభవజ్ఞులైన ఎంపానెల్డ్ ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల సేవలను వినియోగించుకునేందుకు ఏపీ టూరిజం అథారిటీతో కమిటీ సమన్వయం చేయనుంది. జిల్లా యంత్రాంగం, ఇతర ప్రభుత్వ శాఖలు, సినీ పరిశ్రమ సంఘాలతో సమన్వయం చేసుకుంటూ, వేడుకలకు అయ్యే పూర్తి బడ్జెట్ అంచనాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి కమిటీ ప్రతిపాదన చేయనుంది. తెలుగు సినిమా, కళాకారులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి
1964లో నంది అవార్డులకు శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా లేపాక్షిలోని ప్రసిద్ధ నంది విగ్రహం స్ఫూర్తితో ఈ పురస్కారాలకు ఆ పేరు పెట్టారు. తొలినాళ్లలో బంగారు, వెండి, కాంస్య నందుల రూపంలో అవార్డులు అందించేవారు. ఆ తర్వాత నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులను గౌరవించే అత్యున్నత రాష్ట్ర స్థాయి పురస్కారాలుగా ఇవి చరిత్రకెక్కాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంపై తెలుగు సినీ, టెలివిజన్ రంగాల ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల ప్రతిభకు మళ్లీ తగిన గుర్తింపు లభించనుండటంతో ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
2017 – 2025 సంవత్సరాల అవార్డులకు గానూ కమిటీలను ఏర్పాటు చేసింది. జ్యూరీ కమిటీ ఛైర్మన్లు, సభ్యుల వివరాలు ఇలా వున్నాయి.
2017 – 2024 మధ్యలో వచ్చిన సినిమాలలో యేడాదికి మూడు చిత్రాలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ అవార్డులు ఇవ్వబోతోంది. అలానే రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రతి యేడాదికీ ప్రకటించనుంది. ఈ అవార్డుల కమిటీ కి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. వర ప్రసాద్ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ, కైకాల నాగేశ్వర రావు కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
2017, 2018 కమిటీకి సీనియర్ జర్నలిస్ట్ ఎన్.సీతారామరాజు,
2019,2020 కమిటీకి దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి,
2021, 2022 కమిటీకి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు,
2023, 2024 కమిటీకి దర్శకులు రేలంగి నరసింహారావు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు ప్రతి కమిటీలోనూ ఆరుగురు సభ్యులను నియమించారు.
2025వ సంత్సరానికి పూర్తి స్థాయిలో నంది అవార్డులను ప్రకటించబోతున్నారు. ఈ కమిటీకి దర్శకులు బి.గోపాల్ ను ఛైర్మన్ గా, వి ఎన్ ఆదిత్య, ఎం .వి .రఘు,శ్రీమతి కళ్యాణి,శ్రీమతి బైర్రాజు శ్రీ సంధ్య రాజు,మాదాల రవి,సాన యాది రెడ్డి,కె.అజయ్ కుమార్,వి.లక్ష్మి నారాయణ,కాదు పూర్ణ,కమిటీ సభ్యులుగా నియమించారు.
2025 డాక్యుమెంటరీ, ఎడ్యుకేషన్ ఫిలిమ్స్ కమిటీ ఛైర్మన్ గా టి. ప్రసన్న కుమార్,పి .ఎన్.రామచంద్ర రావు,ఎం .ఎస్ .ప్రసాద్, రాధా రాజేశ్వరి,డి.యస్.కణ్ణన్, కూనిరెడ్డి శ్రీనివాస్, కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.
2025వ సంవత్సరానికి గానూ ఉత్తమ సినీ గ్రంథం, రచయిత అవార్డుల కమిటీకి పరుచూరి గోపాలకృష్ణ ఛైర్మన్ గా, లంకా రాంబాబు వర్మ, హేమ సుందర్‌లు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.
2017 నుంచి 2020 వరకూ ఇవ్వబోయే టీవీ అవార్డుల కమిటీకి శింగంపల్లి శ్రుతి ఛైర్మన్ గా, మేకల నరసింగరావు,గుత్తికొండ భార్గవ్, పల్లెమాల సుధాకర్,సర్వేశ్వర్ రెడ్డి,షేక్ అభ్దుల్ కద్దూస్ ,సంపత్ మాడుగుల,డా.చల్లా భాగ్య లక్ష్మి, కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.
2021, 2022 టెలివిజన్ ఫిల్మ్ అవార్డుల కమిటీకి యాట సత్యనారాయణ, చైర్మన్ గా… మేక రామకృష్ణ, శ్రీమతి శిల్ప, అలహరి వెంకట వర ప్రసాద్ రావు , ఎం.ఉదయ్ కుమార్, చిలివేరు వెంకట అప్ప రావు, కె.సత్యనారాయణ,జి.హరి ప్రసాద్, కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.
2025 టెలివిజన్ ఫిల్మ్ అవార్డుల కమిటీకి కొమ్మనపల్లి గణపతి రావు, చైర్మన్ గా… శ్రీమతి రూపా దేవి, కోట శంకర రావు, సుబ్భారాయ శర్మ, ఉదయ బాను,జి.అనిల్ కుమార్, బి.వి.రమణ రావు,ఏ.ప్రసాద రావు,డి.వై.చౌదరి, శ్రీమతి అనిత చౌదరి, శ్రీమతి సన, కె వి ఎస్ దుర్గ, కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.







