ఇంటి గోడలపై పచ్చదనం పరిపరుస్తూ, చూసేందుకు కనులవిందుగా ఉండే అద్భుతమైన క్లైంబింగ్ ప్లాంట్స్ (పాకే మొక్కలు) ఏంటో ఇప్పుడు చూద్దాం!
ప్రతీ ఇంటా ఉండే మనీ ప్లాంట్ గోడలపై లేదా బాల్కనీ గ్రిల్స్‌పై సులభంగా పాకుతూ ఇంటికి అంతులేని పచ్చదనాన్ని తెస్తుంది.
మనీ ప్లాంట్
ఉదయపు ఎండలో అందమైన నీలం లేదా గులాబీ రంగు పూలతో వికసించే ఈ పాకే మొక్క గోడలకు అద్భుతమైన లుక్‌ని ఇస్తుంది.
మార్నింగ్ గ్లోరీ
రంగురంగుల పూలతో గోడలపై దట్టంగా అల్లుకునే బొగన్విల్లియా మొక్క ఇంటి బయటి అందాన్ని రెట్టింపు చేస్తుంది.
రంగుల బొగన్విల్లియా
మల్లె జాతికి చెందిన ఈ తీగ మొక్క గోడలపై అల్లుకోవడంతో పాటు ఇంటి అంతటా సువాసనలను వెదజల్లుతుంది.
స్టెఫనోటిస్
గోడలకు అతుక్కుని దట్టమైన తివాచీలా పెరిగే ఈ ప్లాంట్ ఆధునిక ఇళ్ల బాహ్య గోడల అలంకరణకు పర్ఫెక్ట్ ఛాయిస్.
ఇంగ్లీష్ ఐవి
ప్రత్యేకమైన రూపంలో ఉండే రాఖీ పువ్వుల తీగ మొక్క గోడలపై పాకుతూ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
పాషన్ ఫ్లవర్
ఈ క్లైంబింగ్ ప్లాంట్స్ కేవలం అందాన్ని ఇవ్వడమే కాకుండా, చుట్టూ ఉన్న గాలిలోని మలినాలను తొలగించి స్వచ్ఛతను అందిస్తాయి.
గాలిని శుద్ధి చేసే గుణాలు
ఈ మొక్కలకు పెద్దగా ప్రత్యేక కేర్ అవసరం లేదు. క్రమం తప్పకుండా నీరు అందిస్తే చాలు, ఇవి వేగంగా పెరుగుతాయి.
తక్కువ నిర్వహణ
మీ ఇంటి బోరింగ్ గోడలపై ఈ అందమైన క్లైంబింగ్ ప్లాంట్స్‌ను పెంచి, పచ్చటి ప్రకృతి అందాలను మీ సొంతం చేసుకోండి!