పెళ్లి కూతురు అలంకరణలో కాళ్ల అందాన్ని మరింత పెంచే పట్టీలకు ప్రత్యేక స్థానం ఉంది. హెవీ నుంచి మినిమల్ వరకు అద్భుతమైన బ్రైడల్ ఆంక్లెట్ డిజైన్స్ ఏంటో చూద్దాం!
పెళ్లి వేడుకలకు అచ్చం రాణిలా కనిపించాలనుకునే వధువులకు దేవతల రూపాలు కలిగిన హెవీ టెంపుల్ జ్యువెలరీ పట్టీలు పర్ఫెక్ట్ ఛాయిస్.
హెవీ టెంపుల్ పట్టీలు
తెల్లని ముత్యాలు గుత్తులుగా వేలాడే గుట్టపూసల డిజైన్ పట్టీలు అడుగులో అడుగు వేస్తుంటే వచ్చే గజ్ెల సవ్వడితో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
గుట్టపూసల వెండి పట్టీలు
రెండు లేదా మూడు వరుసల సన్నని గొలుసులతో వచ్చే లేయెర్డ్ పట్టీలు కాళ్లకు ట్రెండ్ అండ్ మోడర్న్ రాయల్ లుక్ను తెచ్చిపెడతాయి.
లేయెర్డ్ చైన్ ఆంక్లెట్స్
మెరిసే వైట్ స్టోన్స్ లేదా కెంపులు పొదిగిన వెండి పట్టీలు లెహంగా లేదా పట్టుచీరల కింద ప్రత్యేకంగా మెరుస్తూ కనిపిస్తాయి.
స్టోన్ స్టడెడ్ బ్రైడల్ పట్టీలు
సంప్రదాయబద్ధంగా పెద్ద గజ్జెలు కలిగి ఉండే వెండి పట్టీలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ పెళ్లి కూతురు లుక్ను పరిపూర్ణం చేస్తాయి.
ట్రెడిషనల్ గజ్జెల పట్టీలు
ఎక్కువ బరువు ఇష్టపడని వారికి సింపుల్గా ఉండే సన్నని సింగిల్ చైన్ పట్టీలు ఎంతో క్లాసిక్ మరియు డీసెంట్ లుక్ను ఇస్తాయి.
మినిమల్ సింగిల్ చైన్ పట్టీలు
కేవలం వెండి కాకుండా మధ్యలో ముత్యాల హంగు ఉండే పట్టీలు మోడర్న్ బ్రైడ్స్ మధ్య విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఘల్లుమనే ముత్యాల పట్టీలు
కొంచెం ముదురు రంగులో, పురాతన కాలం నాటి కళాఖలాన్ని తలపించే యాంటిక్ ఫినిషింగ్ బ్రైడల్ పట్టీలు ఎవర్ గ్రీన్ క్రేజ్ కలిగి ఉంటాయి.
యాంటిక్ ఫినిషింగ్ డిజైన్స్
మీ పెళ్లి రోజున మీ పర్సనాలిటీకి తగిన హెవీ లేదా మినిమల్ ఆంక్లెట్ను ఎంచుకుని, మీ నడకలో ప్రత్యేకమైన అందాన్ని ఒలకబోయండి!