నాని నిర్మాణంలో మరో సేఫ్ గేమ్.. రిలీజ్ కు ముందే లాభాల బాటలో!
నేచురల్ స్టార్ నాని(nani) హీరోగానే కాకుండా నిర్మాతగానూ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాల వెంట పరుగులు తీయకుండా, కథపై నమ్మకంతో చిన్న సినిమాలను నిర్మిస్తూ లాభాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన నిర్మిస్తున్న తాజా సినిమా అలియాస్ రుక్మిణి(Alias rukmini) ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. నితిన్(nithin) హీరోగా మురళీకాంత్ దేవసోత్(muralikanth devasoth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేయడంతో ప్రమోషన్లకు కూడా టైమ్ దగ్గరపడింది.
ఈ సినిమా నిర్మాణం మూడు నెలల లోపే పూర్తికావడం నిర్మాతగా నాని అనుసరిస్తున్న ప్రణాళికాబద్ధమైన విధానానికి నిదర్శనంగా కనిపిస్తోంది. మరోవైపు, డిజిటల్ రైట్స్ అమ్మకం ద్వారా పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తెచ్చుకునే దిశగా డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థతో ఈ వ్యవహారం ఆఖరి దశకు చేరినట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగా ఈ డీల్ పూర్తయితే, థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం నిర్మాతకు అదనపు లాభాలను అందించే అవకాశం ఉంటుంది. అయితే, దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
గతంలో కోర్టు(Court) వంటి చిన్న సినిమాతో నిర్మాతగా మంచి రిజల్ట్ ను, లాభాల్ని అందుకున్న నాని, ఇప్పుడు అలియాస్ రుక్మిణి తోనూ అదే ప్లాన్ ను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. బడ్జెట్ పై కంట్రోల్, సరైన రిలీజ్ ప్లానింగ్ ఆయనకు కలిసొచ్చే అంశాలు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవాలంటే ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం కీలకం. కంటెంట్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టే నాని, నిర్మాతగా తన విజయపరంపరను ఈ సినిమాతోనూ కంటిన్యూ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.








