నార్వాల్ రాధాకృష్ణ మందిర్ నవరాత్రి 2026 వేడుకల షెడ్యూల్ రిలీజ్…
కాలిఫోర్నియా నార్వాల్లోని రాధాకృష్ణ మందిర్ (RadhaKrishna Mandir Norwalk) ఆధ్వర్యంలో నవరాత్రి 2026(Navratri 2026) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన పూర్తి ఈవెంట్ షెడ్యూల్ను తాజాగా విడుదల చేశారు. భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
గర్భా, రాస్ కార్యక్రమాలు…
ఆలయంలో ప్రతిరోజు రాత్రి 8:00 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు భక్తుల కోసం ప్రత్యేకంగా గర్భా, రాస్(Garba & Raas) కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 17వ తేదీన సాయంత్రం 4:00 గంటల నుండి 7:00 గంటల వరకు చిన్నారుల కోసం ప్రత్యేకంగా కిడ్స్ గర్భా(Kids Garba), అక్టోబర్ 18న మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు ఆథమ్ హవన్(Aatham Havan) కార్యక్రమం ఘనంగా జరగనుంది.
లైవ్ మ్యూజిక్…
ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగా వివిధ తేదీలలో ప్రముఖ సంగీతకారులు , డీజేలు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు:
అక్టోబర్ 11 నుండి 15 వరకు: డీజే విశ్వజిత్ సంగీత విభావరి.
అక్టోబర్ 16, 18 , 25 తేదీలలో: డా. ధిరేన్ బుష్ లైవ్ షో.
అక్టోబర్ 17 , 19 తేదీలలో: అమి పటేల్ ప్రదర్శన.
అక్టోబర్ 20వ తేదీన: ప్రీత్యుష లైవ్ మ్యూజిక్.
స్పాన్సర్షిప్ వివరాలు
కోలా మోటెల్స్ సౌజన్యంతో ఈ వేడుకల్లో పాల్గొనేవారి కోసం ప్రత్యేకంగా రాఫిల్ అండ్ ప్రైజెస్(Raffle & Prizes) ఏర్పాటు చేశారు. ఐప్యాడ్ (iPad), డైమండ్ పెండెంట్, సిల్వర్ లాగ్డి, ఆపిల్ వాచ్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. ప్లాటినం ($5,000), గోల్డ్ ($2,500), సిల్వర్ ($1,000) రూపంలో స్పాన్సర్షిప్ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
సంప్రదింపు వివరాలు
ఈ వేడుకల కోసం కేర్మోర్ మెడికల్ , స్కూల్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ వద్ద ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు. వేదిక చిరునామా: 12634 Pioneer Blvd, Norwalk, CA 90650. మరిన్ని వివరాల కోసం నిర్వాహకులను సంప్రదించవచ్చు:
పరుల్ సంపత్: 562-673-9058
కేతన్: 909-576-3041
వీరేష్ దేశాయ్: 562-760-5229
ప్రవీణ్ పటేల్: 562-965-3286








