మంత్రా లా ఆఫీస్, ధనాని EB5 ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వీసా, గ్రీన్ కార్డ్ పై అవగాహన
అమెరికాలో నివసిస్తున్న H-1B వీసాదారులు మరియు ఇతర ఆసక్తి గల వారి కోసం EB-5 ఇన్వెస్టర్ వీసా, గ్రీన్‌కార్డ్ మార్గాలపై అవగాహన కల్పించేందుకు షుగర్ ల్యాండ్ లో అవగాహన సదస్సు జరిగింది. మంత్రా లా ఆఫీస్ (Mantra Law Office) మరియు ధనాని EB-5 ఇంటర్నేషనల్ (Dhanani EB-5 International) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.
నవంబర్ 18 న టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో ఉన్న ఇండియన్ సమ్మర్ రెస్టారెంట్లో (16260 Kensington Dr, Ste B, Sugar Land, TX) ఈ కార్యక్రమం జరిగింది. అమెరికాలో పెట్టుబడులు, అవకాశాల ద్వారా గ్రీన్‌కార్డ్ పొందే ప్రక్రియపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడింది.
ఇవి కూడా చదవండి
ఇందులో భాగంగా డగ్ వాషింగ్టన్ (COO, ధనాని EB-5): EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమా మంత్రవాది (ప్రిన్సిపల్ అటార్నీ & వ్యవస్థాపకురాలు, మంత్రా లా ఆఫీస్): EB-5 ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ, అర్హతలు, పెట్టుబడి నిబంధనలు, రాబోయే సంభావ్య మార్పులపై వివరించారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నందున ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి అవకాశం కల్పించారు. మరిన్ని వివరాల కోసం 214-274-2235 నంబర్‌ను సంప్రదించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు.







