మళ్లీ కొత్త డైరెక్టర్లకు అవకాశాలు.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil raju) కెరీర్ స్టార్టింగ్ నుంచే కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తనదైన ముద్ర వేశారు. అప్పట్లో స్టార్ డైరెక్టర్ల కంటే కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. అలా సుకుమార్(Sukumar), శ్రీకాంత్ అడ్డాల(Srikanth addala), బోయపాటి శ్రీను(boyapati srinu), భాస్కర్(Bhaskar), వంశీ పైడిపల్లి(Vamshi paidipally) వంటి డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా, వారికి మంచి సక్సెస్‌లను అందించారు. ఆ తర్వాత స్టార్ హీరోలు, అగ్ర డైరెక్టర్లతోనూ వరుసగా సినిమాలు నిర్మిస్తూ తన స్థాయిని మరింత పెంచుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు మరోసారి తన పాత రూట్ లోనే ప్రయాణించాలని దిల్ రాజు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై తెరకెక్కించబోయే కొత్త సినిమాల కోసం ఇప్పటికే అరడజనుకు పైగా కొత్త డైరెక్టర్లతో డిస్కషన్స్ జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో మరో విభాగాన్ని ప్రారంభించి, ఏఐ (AI) టెక్నాలజీపై స్పెషల్ టీమ్ తో పనిచేయిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో దాదాపు పది మంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.
నేటి పోటీ ప్రపంచంలో భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలనే ఆలోచనకు భిన్నంగా దిల్ రాజు తీసుకుంటున్న ఈ డెసిషన్ అభినందనీయం. కథలో విషయం ఉంటే కొత్తవారితోనూ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించవచ్చని ఆయన గతంలోనే ప్రూవ్ చేశారు. యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు కల్పించడంతో పాటు, కొత్త కథలను ఎంకరేజ్ చేసే ఇలాంటి ప్రయత్నాలను ఇతర నిర్మాతలు కూడా ఆదర్శంగా తీసుకుంటే టాలీవుడ్ కు మరింత మంది టాలెంటెడ్ డైరెక్టర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.







