వెటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలకు అంతా సిద్ధం.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి!
అమెరికాలోని శాన్ రామన్ నగరంలో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు సంఘం (WETA – Women Empowerment Telugu Association) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మన సంస్కృతీసంప్రదాయాలు , ఐక్యతా స్ఫూర్తిని చాటిచెప్పేలా ఈ వేడుకలు జరగనున్నాయి.
వేడుకల వివరాలు:
తేదీ: శనివారం, అక్టోబర్ 17, 2026
సమయం: మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు
వేదిక: విండెమేర్ రాంచ్ మిడిల్ స్కూల్, శాన్ రామన్(Windemere Ranch Middle School, San Ramon)
కార్యక్రమ ప్రత్యేకతలు…
వెటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి , తెలంగాణ ఎమ్మెల్యే శ్రీమతి ఎన్.పద్మావతి రెడ్డి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. పూలు, సంస్కృతీసంప్రదాయాల కలబోతతో కూడిన ప్రదర్శనలతో పాటు Mogudzpellamz బృందం నుంచి బాబీ & చందు ఆధ్వర్యంలో లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మన సంప్రదాయాలను, ఐక్యతా భావాన్ని మరింత పెంపొందించుకునే ఈ వేడుకలకు కుటుంబసమేతంగా, స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.








