NRIVA సంస్థలో వివిధ పదవుల కోసం నోటిఫికేషన్ విడుదల… అప్లై చేసుకోండి త్వరగా..
వాసవీ అసోసియేషన్ కి సంబంధించి వివిధ పదవుల కాలపరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో ఆయా పదవులు చేపట్టాలన్న ఆసక్తి వున్న వారు తమ పేర్లను స్వయంగా ప్రతిపాదించాలని ఎన్నారై వాసవీ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ తడ్కమళ్ల పేరుతో ఓ ప్రకటన కూడా విడుదలైంది.
‘‘డియర్ NRIVA కుటుంబ సభ్యుల్లారా….
‘‘జనవరి 1, 2017 తో మన అసోసియేషన్ కి సంబంధించి, వివిధ పదవుల కోసం కొత్త పదవీ కాలం ప్రారంభం అవుతుంది. ఈ తరుణంలో అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ ప్రవీణ్ తడకమళ్ల మార్గదర్శకత్వంలో వివిధ నాయకత్వ స్థానాలకు గాను తమ పేర్లను స్వయంగా ప్రతిపాదించుకోవాలని NRIVA లైఫ్ మెంబర్ల ను సాదంగా ఆహ్వానిస్తోంది. మీరిచ్చే విలువైన అభిప్రాయాలు, అమూల్యమైన సలహాలను ఆధారంగా చేసుకొని, కొత్త కొత్త కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నాం. ఈ కార్యకలాపాలలో కొన్ని గతంలో విస్తృత కమిటీలలో భాగంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి, సమాజంపై మరింత ప్రభావం చూపించాలని మరిన్ని కొత్త కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం.
ప్రతి కార్యక్రమానికి కూడా.. దాని లక్ష్యాలను సాధించడంలో పూర్తి జవాబుదారీతనంతో, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఓ ప్రత్యేక బృందం నాయకత్వం కూడా వహిస్తోంది. కమిటీలు మరియు కార్యక్రమాల సమగ్ర జాబితాను పరిశీలించి, మీ ఆసక్తి, అనుభవం మరియు అభిరుచులకు అనుగుణంగా ఉండే నాయకత్వ బాధ్యతల కోసం మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోవాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన సంస్థలోనూ, విస్తృత సమాజంలోనూ సేవ చేయడానికి, నాయకత్వం వహించడానికి మరియు అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి ఇది మీకు లభించిన ఒక గొప్ప అవకాశం. మనమందరం కలిసి NRIVAను మరింత బలోపేతం చేస్తూ, దానిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్దాం.2027–2028 కాలానికి గాను బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ డైరెక్టర్, రీజినల్ డైరెక్టర్, స్టాండింగ్ కమిటీ (చైర్, కో-చైర్స్ మరియు సభ్యులు) మరియు చాప్టర్ లీడ్ పాత్రల కోసం మీది మీరే స్వయంగా నామినేషన్లను సమర్పించడానికి కింద క్లిక్ చేయండి. అప్లై చేయండి.
https://nriva.org/nriva-2027-28-nomination-form








