ఆరియా యూనివర్సిటీ వేదికగా అక్టోబర్ 11న ‘నాద వర్ణిక: వీణా డ్యూయెట్’ సంగీత కచేరీ..
కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్లో ఉన్న ఆరియా యూనివర్సిటీ (Aria University), ఎంసీఈఎఫ్ఈఈ (MCEFEE) సంయుక్తంగా ‘నాద వర్ణిక: వీణా డ్యూయెట్'(Nāda Varnika: Veena Duet) పేరుతో ఒక అద్భుతమైన భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీని నిర్వహించనున్నాయి. సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఈ కార్యక్రమం అక్టోబర్ 11, 2026 న జరగనుంది.
కార్యక్రమ సమయం…
తేదీ: ఆదివారం, అక్టోబర్ 11, 2026
సమయం: సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు
వేదిక: ఆరియా యూనివర్సిటీ, 1521 కాలిఫోర్నియా సర్కిల్, మిల్పిటాస్, CA 95035
ప్రవేశం: ఉచితం (Entry Free)
ప్రత్యేకంగా పాల్గొంటున్న ప్రముఖ కళాకారులు
విద్వాన్ కన్నన్ త్రిపునితుర (Vidwan Kannan Tripunithura)
కుమారి చారులిత చంద్రశేఖర్ (Kumari Charulitha Chandrasekar)
సంగీత కళా ఆచార్య డా.ఆర్.ఎస్.జయలక్ష్మి (Sangita Kala Acharya Dr.R.S.Jayalakshmi)
రిజిస్ట్రేషన్, సంప్రదింపుల వివరాలు
ఈ కార్యక్రమానికి హాజరయ్యే అంచనాను తెలుసుకోవడానికి నిర్వాహకులు ముందస్తు రిజిస్ట్రేషన్‌ను కోరుతున్నారు. ఆసక్తి గలవారు https://aria.edu/events/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. సంగీతాన్ని ఆస్వాదించే వారు స్నేహితులతో కలిసి ఈ వేడుకకు రావాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం కోసం శ్రీదేవి గంటి గారెని +1(510)364-2493 నంబర్లో సంప్రదించవచ్చు లేదా [email protected] ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.








