గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కల్యాణం, రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 31 వ తేదీన ఈ కార్యక్రమం వుంటుంది. అయితే.. పూర్తి సమాచారాన్ని అసోసియేషన్ వారు అతి తొందర్లోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేయించే అర్చకులు ప్రముఖమైన రాయలసీమ దేవాలయం నుంచి రానున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అసోసియేషన్ ప్రతినిధులు వున్నారు.








