సైబర్ మోసానికి గురిఅయిన నటి అనిత చౌదరి
హైదరాబాద్‌లో సినీ నటి గోగినేని అనిత చౌదరి సైబర్ మోసానికి గురయ్యారు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు.
ఇవి కూడా చదవండి
మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న అనిత.. అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు విమాన టికెట్ల కోసం ఆన్లైన్లో ట్రావెల్ ఏజెంట్‌ను వెతికారు. ఈ క్రమంలో ‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ ఫేక్ సంస్థ పేరుతో రాజేష్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు.







