హ్యూస్టన్ లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రులు
హ్యూస్టన్ లోని చిన్మయ మిషన్ సభ్యులు దసరా శరన్నవరాత్రులను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మ వార్ని సేవించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు సంప్రదాయకంగా ప్రార్థన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుజరాతీ సంప్రదాయంలో గర్భా, రాస్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆనందంగా పాల్గొన్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఉత్సాహంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బేతాలీ, త్రణ్ తాలీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ వేడుక యొక్క సారాంశం కేవలం నృత్యానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఒక్కరూ వేడుకలలో పాలుపంచుకుని ఆనందాన్ని పంచుకునే ఒక అద్భుత సందర్భం ఇది. దండియా, గర్బా, భాంగ్రా లేదా సహజమైన కదలికల ద్వారా ప్రతి బృందం కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొంది. ఈ సందర్భంగా అనేక మంది వాలెంటీర్లు కూడా అత్యంత భక్తిభావంతో సేవలు అందించారు. మా దుర్గ, మా లక్ష్మి మరియు మా సరస్వతిని ప్రార్థిస్తూ, మనలోని ప్రతికూల ధోరణులను అధిగమించే శక్తిని, సద్గుణాలను పెంపొందించుకునే పవిత్రతను మరియు మనలోని దైవాన్ని గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించమని అందరూ వేడుకున్నారు.
చిన్మయ మిషన్ హ్యూస్టన్, శ్రీ సౌమ్యకాశీ శివాలయం మరియు దాని కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి www.chinmayahouston.org, www.saumyakasi.org వెబ్సైట్లను సందర్శించండి లేదా దేవాలయాన్ని 281 568 1690 నంబర్లో, జే దేశ్‌ముఖ్‌ను 832 541 0059 నంబర్లో లేదా భారతి సుతారియాను 281-933-0233 నంబర్లో సంప్రదించండి.







