శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో దీపావళి ముత్యాల అలంకరణ.. భక్తులకు ప్రత్యేక ఆహ్వానం
కాలిఫోర్నియా రాష్ట్రం టొరెన్స్ నగరంలో వెలసిన శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్ అండ్ రిలిజియస్ అకాడమీ ఆధ్వర్యంలో రాబోయే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యంత అద్భుతమైన దీపావళి పర్ల్ అలంకారమ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ పవిత్ర దీపావళి పర్వదినం సందర్భంగా దివ్య భవ్య పంచముఖ హనుమాన్ స్వామివారికి అద్భుతమైన 11 అడుగుల ఎత్తైన ముత్యాల అలంకరణను సమర్పించనున్నారు.
అలంకరణ విశేషాలు..
దీపావళి పవిత్ర రోజున స్వామివారికి సమర్పించనున్న ఈ సుందరమైన 11 అడుగుల ముత్యాల అలంకరణ కోసం భక్తులు స్పాన్సర్షిప్ రూపంలో భాగస్వాములు కావచ్చని నిర్వాహకులు తెలిపారు. హనుమాన్ స్వామివారి కమల చరణాల వద్ద భక్తులు తమ భక్తిపూర్వక సమర్పణ చేసుకోవడానికి ఇదొక అరుదైన అవకాశం అని పేర్కొన్నారు.
స్పాన్సర్షిప్ వివరాలు..
గ్రాండ్ స్పాన్సర్: $2,001. ఈ విభాగంలో సహకరించే వారి పేరు ప్రత్యేక స్పాన్సర్‌గా నమోదు చేస్తారు.
ఇతర స్పాన్సర్‌షిప్‌లు: $1,001, $501 , భక్తులు తమ మనసుకి నచ్చిన ఎంత మొత్తమైనా విరాళంగా అందించవచ్చు.
ఇవి కూడా చదవండి
సంప్రదించాల్సిన వివరాలు ..
శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్ అండ్ రిలిజియస్ అకాడమీ, 23805 హాతోర్న్ బ్లేవ్వార్డ్, టొరెన్స్, CA 90505 ఈ పవిత్ర సేవకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆచార్యజీని కాల్ లేదా వాట్సాప్ (+310) 971-1388 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
అలాగే శిరీష చెరుకుపల్లిని (+405) 326-3598 నెంబర్ ద్వారా లేదా టెంపుల్ కార్యాలయం (+310) 561-8082 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.
అదనపు వివరాల కోసం www.hanumantemplela.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా [email protected] ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.








