డెట్రాయిడ్ తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలకు రెడీ.. ఈసారి వేడుకలు మరింత స్పెషల్!
డెట్రాయిడ్ తెలుగు అసోసియేషన్ (DTA) ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఈ సారి దీపావళి సెలబ్రేషన్స్ కి మరో విశేషం కూడా వచ్చి చేరింది. డెట్రాయిడ్ తెలుగు అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ లోకి కూడా ప్రవేశించబోతోంది.అందుకు ఈ సంవత్సరం మరింత ప్రత్యేకం కూడా కానుంది.
డెట్రాయిడ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ దీపావళి సెలబ్రేషన్ నవంబర్ 21 న జరగనున్నాయి. BLOOMFIELD HILLS HIGH SCHOOL లో వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలు రోజంతా జరుగుతాయి.
ఈ దీపావళి సెలెబ్రేషన్స్ సందర్భంగా నిర్వాహకులు లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్, డిన్నర్, స్టాల్స్, షాపింగ్ కూడా వుంటుంది. అలాగే కల్చరల్ రిజిస్ట్రేషన్స్, వేండార్ షిప్ కి సంబంధించిన వివరాలను తొందర్లోనే ప్రకటించనున్నారు.
ఈ సెలబ్రేషన్స్ కి మనం మన కుటుంబాలతో సహా హాజరవుదాం. ఇలా హాజరవ్వడం ద్వారా అన్ని కుటుంబాలూ కలిసి, జరుపుకోవడం ద్వారా మధురానుభూతులను సంపాదించుకోవచ్చు. అలాగే మధురమైన జ్ఞాపకాలను కూడా పదిలం చేసుకోవచ్చు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 21,
సమయం : రోజంతా
వేదిక : BLOOMFIELD HILLS HIGH SCHOOL








