అట్లాంటా హిందూ ఆలయంలో అక్టోబర్ 24న శ్రీవారి ఉదయస్తమాన సేవా వైభవం..
అట్లాంటా హిందూ ఆలయం(Hindu Temple of Atlanta) ఆధ్వర్యంలో అక్టోబర్ 24, 2026 శనివారం రోజున శ్రీవారి ఉదయస్తమాన సేవా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమలలో జరిగే శ్రీవారి సేవల మాదిరిగానే ఉదయం సుప్రభాత సేవల నుంచి రాత్రి శయనోత్సవం వరకు ఒక పూర్తి రోజు పాటు దివ్యమైన సేవలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ కుటుంబ సమేతంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.
కార్యక్రమాల వివరాలు:
ఉదయం 6:00 గంటలకు: సుప్రభాతం & విశ్వరూప సేవా (గోమాత , దూడతో), విష్ణు ఆలయం. (గమనిక: శ్రీవారి మూల విగ్రహ అభిషేకం శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉంటుంది).
ఉదయం 7:00 గంటలకు: నిత్య ఆరాధన & తోమాల సేవా, విష్ణు ఆలయం.
ఉదయం 8:00 గంటలకు: సేవా కాలం – కొలువు & పంచాంగ శ్రవణం, విష్ణు ఆలయం.
ఉదయం 9:00 గంటలకు: సహస్ర నామర్చణ, విష్ణు ఆలయం.
ఉదయం 11:00 గంటలకు: తిరుప్పావడ సేవా, సట్టుమొరై & తీర్థ ప్రసాదం, విష్ణు ఆలయం.
మధ్యాహ్నం 12:30 గంటలకు: శ్రీవారి కల్యాణ ఉత్సవం, నిత్య కల్యాణి.
మధ్యాహ్నం 1:30 గంటలకు: భజన (మధ్యాహ్న భోజన విరామం).
మధ్యాహ్నం 3:00 గంటలకు: ఆర్జిత బ్రహ్మోత్సవం & సకల వాద్య సేవా, నిత్య కల్యాణి.
సాయంత్రం 5:00 గంటలకు: వసంతోత్సవం & విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య కల్యాణి.
సాయంత్రం 7:00 గంటలకు: సహస్ర దీపోత్సవం, నిత్య కల్యాణి.
రాత్రి 8:00 గంటలకు: పుష్ప పల్లకి ప్రాకార ఉత్సవం.
రాత్రి 8:30 గంటలకు: ప్రణయ కలహోత్సవం – శ్రీవారి యాదస్థానం & శయనోత్సవం, విష్ణు ఆలయం.
స్పాన్సర్షిప్, విరాళాల వివరాలు:
గ్రాండ్ స్పాన్సర్షిప్ ($2,500): అన్ని సేవలతో పాటు శేష వస్త్రం, లడ్డు, వడ ప్రసాదం అందజేస్తారు.
గోల్డ్ స్పాన్సర్షిప్ ($1,116): అన్ని సేవలతో పాటు శేష వస్త్రం, లడ్డు , వడ ప్రసాదం లభిస్తాయి.
సిల్వర్ స్పాన్సర్షిప్ ($501): సుప్రభాత సేవా, తోమాల సేవా ఉంటాయి , లడ్డు, వడ ప్రసాదం అందిస్తారు.
శ్రీ వారి కల్యాణోత్సవం: $251 (లడ్డు ప్రసాదం లభిస్తుంది).
తోమాల సేవా: $251.
ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపోత్సవం, సుప్రభాత సేవా, శ్రీవారి సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవా: ఒక్కో సేవకు రూ.$101.
శయనోత్సవ సేవా & అన్నదానం: ఒక్కో దానికి $51.
మరిన్ని వివరాల కోసం ఆలయ కార్యాలయాన్ని 770-907-7102 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు. అధ్యక్షులు రవి (678-464-9027), పూజా కమిటీ చైర్ అరుణ కైలాస (404-368-1509), వైస్ ప్రెసిడెంట్ సాయిరామ్ సూరపనేని (404-578-2298)లను సంప్రదించవచ్చని ఆలయ వర్గాలు తెలిపాయి.








