జీఆర్టీఏ 6ఏ6 క్రికెట్ టోర్నమెంట్ 2026 గ్రాండ్ సక్సెస్.. విజేతలకు బహుమతుల ప్రదానం
జీఆర్టీఏ (GRTA) ఆధ్వర్యంలో నిర్వహించిన 6ఏ6 క్రికెట్ టోర్నమెంట్ 2026 అత్యంత వైభవంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి క్రీడాకారుడికి, జట్టుకు, విజేతలకు, రన్నరప్‌లకు, ఉత్సాహంగా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడాస్ఫూర్తి, అంకితభావంతో ఈ టోర్నమెంట్‌ను అందరూ కలిసి అద్భుతంగా విజయవంతం చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
విజేతలు, రన్నరప్‌ల వివరాలు:
డివిజన్ I:
విన్నర్ – సాడ్లర్ సేన (Sadler Sena)
రన్నరప్ – టీ2ఐ ట్రక్ (T2i Truck)
డివిజన్ II:
విన్నర్ – డెక్కన్ వారియర్స్ (Deccan Warriors)
రన్నరప్ – ఎంసీసీ (MCC)
డివిజన్ III:
విన్నర్ – టైటాన్స్ (Titans)
రన్నరప్ – సాండ్లర్ థండర్స్ (Sandler Thunders)
ఈ టోర్నమెంట్లో పాల్గొని పోటీతత్వాన్ని, వినోదాన్ని పంచుకున్న ప్రతి జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ సెక్రటరీ స్నేహిత్ రెడ్డి ఈ టోర్నమెంట్‌ను మొదటి నుంచి చివరి వరకు విజయవంతంగా నిర్వహించినందుకు జీఆర్టీఏ టీం సభ్యులు అభినందనలు తెలిపారు. డైరెక్టర్లు రమేష్, యుగి, వాలంటీర్లు కిరణ్, భాను, మాహి, రాజా, రామ్‌కి, ఇతర వాలంటీర్ల సేవలను ప్రశంసించారు. అలాగే మాజీ అధ్యక్షులు షేకర్ రెడ్డి, కృష్ణ, శంకర్, కృష్ణారెడ్డి, గణేష్, విజయ్, కమ్యూనిటీ లీడర్లు రాజ్ గద్దం, శివారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు విచ్చేసి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ టోర్నమెంట్ కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా, మన సమాజాన్ని ఒక్కచోటికి చేర్చి, ఒకరికొకరు మద్దతునిస్తూ మంచి జ్ఞాపకాలను పంచుకునే వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. జీఆర్టీఏ – టూగెదర్ వి గ్రో!(GRTA – Together We Grow!) అనే నినాదంతో ఈ టోర్నమెంట్‌ను చిరస్మరణీయంగా మార్చిన అందరికీ జీఆర్టీఏ బృందం ధన్యవాదాలు తెలిపింది.








