వైట్ బ్లేజర్లో రాశీ ఖన్నా.. స్టైలిష్ లుక్తో కట్టిపడేస్తోన్న బ్యూటీ!
ఢిల్లీ భామ రాశీ ఖన్నా(raashi khanna) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఊహలు గుసగులాడే(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాశీ, తక్కువ టైమ్ లోనే పలువురు స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా పలు సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన రాశీ, ఓటీటీ ప్లాట్ఫార్మ్ లోనూ తనదైన ముద్ర వేస్తోంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఇన్స్టాలో ఆమె షేర్ చేసిన ఫోటోల్లో వైట్ కలర్ డీప్ నెక్ బ్లేజర్ ధరించి, వేవీ బ్రౌన్ హెయిర్, సింపుల్ మేకప్ తో ఎంతో క్లాసీగా కనిపించింది. ఈ డ్రెస్ లో రాశీ హుందాగా ఉండటంతో పాటూ ఎంతో గ్లామరస్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.








