జైలర్2 విషయంలో నెల్సన్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?
సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikant) నటించిన జైలర్2(jailer2) కోసం సౌత్ సినీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. గురువారం థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో రిలీజ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ, సినిమాపై ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదనే డిస్కషన్ నడుస్తోంది. జైలర్ ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో సీక్వెల్‌పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయని భావించారు. అయితే, అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం, తమిళనాడులోనూ పెద్దగా సందడి కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో మేకర్స్ కావాలనే ప్రమోషనల్ హైప్ ను తగ్గించిందనే టాక్ వినిపిస్తోంది.
డైరెక్టర్ నెల్సన్(nelson) ఈసారి ఆడియన్స్ కు ముందుగానే అన్ని విషయాలు చెప్పకుండా, సినిమాలోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను సీక్రెట్ గా ఉంచాలని భావించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ కూడా భారీ అంచనాలు లేకుండానే రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అదే ఫార్ములాను ఇప్పుడు సీక్వెల్ విషయంలోనూ ఫాలో అవుతున్నట్టు సమాచారం. అయితే, అనిరుధ్(anirudh) మ్యూజిక్ పై కొంత నిరాశ వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలకంగా మారనుంది. స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆసక్తికరంగా సాగితేనే ఈ స్ట్రాటజీ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, నిర్మాతలు, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే సినిమాను చూసి రిజల్ట్ పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. రజినీకాంత్ సైతం సినిమా కలెక్షన్లే మాట్లాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహించారు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే తక్కువ హైప్ సినిమాకు ప్లస్ అవుతుంది. లేదంటే భారీ అంచనాలను అందుకోలేకపోవడం జైలర్2 రిజల్ట్ పై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.








