తొలి షెడ్యూల్‌తోనే మోక్షజ్ఞ డిఫరెంట్ ప్లాన్!
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) కొడుకు మోక్షజ్ఞ(mokshagna) సినీ ఎంట్రీపై టాలీవుడ్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ గా వశిష్ఠ(vassishta) ను ఫైనల్ చేయగా, తాజాగా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన సమాచారం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్లోనే యాక్షన్ సీన్స్ ను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీని కోసం భారీ సెట్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏర్పాట్లను బట్టి మోక్షజ్ఞను స్క్రీన్ పై పరిచయం చేసే విషయంలో మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది.
ఈ సినిమాను రెగ్యులర్ కమర్షియల్ కథకు భిన్నంగా భారీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పునర్జన్మలు, విభిన్న కాలాలకు సంబంధించిన కథనం, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలు ఇందులో కీలకం కానున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కథను స్క్రీన్ పై ఆవిష్కరించాలంటే యాక్షన్ సీన్స్ తో పాటు గ్రాఫిక్స్, టెక్నికల్ వాల్యూస్ విషయంలోనూ స్పెషల్ ప్లానింగ్ అవసరం. అందుకే మొదటి షెడ్యూల్ నుంచే భారీ స్థాయిలో షూటింగ్ ను చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే టార్గెట్ తో ఈ కథను ఎంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాలకృష్ణ(balakrishna) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే హీరోయిన్ ఎంపికతో పాటు ఇతర వివరాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చాకే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.








