ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఈసీ, సీజేఐదా?: కిషన్ రెడ్డి
ప్రతిపక్ష నేత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని రాహుల్‌గాంధీ ((Rahul Gandhi) )పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. అధికారం కోసం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ (Parliament)లో విపక్షాలు నవ్వులపాలవ్వడం దేశ ప్రజలు చూశారు. ఇప్పుడు మోదీ (Modi), అమిత్‌షా (Amit Shah), మోహన్ భాగవత్ (Mohan Bhagwat), అజిత్ ఢోబాల్ దేశానికి ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా గద్దె దిగాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడితే ఈసీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ది బాధ్యత్యా ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఈసీ, సీజేఐదా? మీకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వలేదని సీజేఐని బెదిరిస్తున్నారు. భారత్ ఏమైనా సోనియా కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీనా? భారత్‌లో కాంగ్రెస్ మార్కు నియంతృత్వపు రాజకీయం నడవదు అని హెచ్చరించారు.








