ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్
నాంపల్లి ఏసీబీ కోర్టు (ACB Court)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ (Discharge Petition) దాఖలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు ( Formula E car race) కేసులో నిందితుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్పై ఈ నెల 30న విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసులో కేటీఆర్ ( KTR) ఏ 1గా ఉన్న సంగతి తెలిసిందే.








