మళ్లీ తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ వినోద్‌కుమార్
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ (Tadakamalla Vinod Kumar) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కు బదిలీ అయ్యారు. గత ఏడాది జులైలో తెలంగాణ నుంచి బదిలీపై మద్రాస్ హైకోర్టు (Madras High Court)కు వెళ్లిన జస్టిస్ వినోద్‌కుమార్, తిరిగి సొంత రాష్ట్రానికే బదిలీ అయ్యారు. ఈనెల 14న ఆయన మొదటి కోర్టు హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నల్గొండ జిల్లా (Nalgonda District)కు చెందిన వినోద్‌కుమార్ ఉస్మానియా (Osmania) లో న్యాయశాస్త్ర పట్టా పొంది, 1988లో బార్కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గా 2019 ఆగస్టు 26న నియమితులై 2025 మద్రాస్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు.








