తానా మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో పురుషుల దినోత్సవం సందర్భంగా ఈషా యోగా, ధ్యాన సదస్సు!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) మిడ్-అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం-2026(TANA Men’s Day 2026) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ది ఫ్యూచర్ ఈజ్ ఎవ్రీవన్(The Future Is Everyone), అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. దైనందిన జీవిత ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు, శరీరాన్ని రిఫ్రెష్ చేసుకునేందుకు ఈషా ఫౌండేషన్ సౌజన్యంతో ప్రత్యేక యోగా, ధ్యాన సదస్సును నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ విశేషాలు…
యోగ నమస్కార్(Yoga Namaskar)
నాడి శుద్ధి (Nadi Shuddhi)
మిరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ (Miracle of Mind Meditation)
వేదిక, సమయ వివరాలు…
తేదీ: నవంబర్ 15, 2026(ఆదివారం)
సమయం: ఉదయం 9:30 AM నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
వేదిక: 399 అర్కోలా రోడ్, కాలేజ్విల్లే, PA 19426
గమనిక…
ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు సొంతంగా యోగా మ్యాట్లను వెంట తెచ్చుకోవాలని నిర్వాహకులు కోరారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్‌ను సందర్శించవచ్చు: https://tinyurl.com/2e55synf
కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తానా మిడ్ అట్లాంటిక్ నిర్వాహక బృంద సభ్యులు.. ఫణి కాంతేటి (మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ – 610-620-4135), శ్రీదేవి, గజేంద్ర బాబు తదితరులు కోరారు.








