అదే నిరూపిస్తే .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీశ్ రావు సవాల్
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)కి మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సవాల్ విసిరారు. తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీళ్లు తెస్తామంటున్నారనీ, అదే నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా (Resignation) చేస్తానని అన్నారు. ఎల్లంపల్లికి గ్రావిటీతో నీళ్లు తేవడం కుదరదని తేలితే ఉత్తమ్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బృందం మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis)ను కలిసిన నేపథ్యంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు డీపీఆర్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే ఏపీలో వర్షపాత లోటు ఎక్కువ. అలాంటిది ఇక్కడ క్రాప్ హాలీడే ఎందుకు ఉంది. ఏపీలో ఎందుకు లేదు? దేవాదుల వద్ద పంపులు నడిపి ఉంటే వరంగల్ జిల్లాకు కరవు ఉండేది కాదు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా ఎందుకు ఎత్తిపోయలేదు. కల్వకుర్తిలో ఐదు మోటార్లున్నా రెండు మోటార్లే నడుపుతున్నారు. అది కూడా రెండు గంటలే నడుపుతున్నారు. శ్రీశైలం నుంచి ఏపీ తీసుకెళ్తున్నదెంత? తెలంగాణ తీసుకొస్తున్నదెంత? దేవాదుల, కల్వకుర్తి పంపుల వాడకంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కన్నెపల్లి వద్ద నీళ్లను అవకాశం ఉన్నా ఎందుకు ఎత్తిపోయేలేదు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు, మÖమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరవే అని అన్నారు.








