కాన్పూర్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లిన సోషల్ మీడియా స్టార్ అంజలి అరోరాకు ఇప్పుడు లీగల్ నోటీసు వచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది?
కాన్పూర్‌లోని ‘నగాడా నైట్’ కార్యక్రమానికి అంజలి అరోరా హాజరయ్యారు. ఆమె రాత్రి 9 నుంచి 9.45 వరకు వేదికపై ఉండాలి. కానీ ఆలస్యంగా వచ్చి సుమారు 12 నిమిషాలకే వెళ్లిపోయారని ఆరోపణ.
వివాదం ఎలా మొదలైంది?
ఈవెంట్లో డీజే, నిర్వాహకులపై అంజలి అసహనం వ్యక్తం చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ‘కచ్చా బాదామ్’ పాట ప్లే చేయడంపై ఆమె అభ్యంతరం చెప్పింది. ఆమె వ్యాఖ్యలతో కాన్పూర్ ప్రజల ప్రతిష్ఠ దెబ్బతింది.
పాటే వివాదానికి కారణమా?
అంజలి అరోరా కు లీగల్ నోటీసు పంపారు. పరువు నష్టానికి రూ.1 కోటి, ఆర్థిక నష్టాలకు రూ.20 లక్షలు కలిపి మొత్తం రూ.1.20 కోట్లు కోరినట్లు సమాచారం. 15 రోజుల్లో బహిరంగ క్షమాపణ డిమాండ్.
భారీ పరిహారం
హోటల్లో కొందరు తనకు ఇబ్బంది కలిగించారని, పలువురు పురుషులు వెయిటర్‌తో కలిసి తన గదిలోకి వచ్చారని అంజలి ఆరోపించారు.
అంజలి వాదన
తన వ్యాఖ్యలు కాన్పూర్ ప్రజలందరినీ ఉద్దేశించి చేసినవి కావని, తనను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల ప్రవర్తనపైనే స్పందించానని వివరణ ఇచ్చారు.
పాటపై క్లారిటీ
అంజలి పేరుతో వైరల్ అయిన అభ్యంతరకర వీడియో తనది కాదని ఆమె ఖండించారు. మార్ఫింగ్, పరువు నష్టం విషయంలో 2024లో మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
వైరల్ వీడియో వివాదం
ఈ వివాదంలో తదుపరి పరిణామాలు లీగల్ నోటీసుకు ఇచ్చే సమాధానం, అధికారుల చర్యలపై ఆధారపడి ఉంటాయి.
రూ.1.20 కోట్ల వివాదం.. ఏం తేలనుంది?